ఒక్క పాట మినహా పూర్తైన మనోహరుడు

Manoharudu
సౌత్ ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్న ‘మనోహరుడు'(తమిళ్ లో ఐ) సినిమా కోసం అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో శంకర్ – విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అపరిచితుడు’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఒక్క సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఇది కాకుండా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే విక్రమ్ ఫస్ట్ హాఫ్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేసాడు. సెకండాఫ్ కి డబ్బింగ్ చెప్పే లోపు కొద్ది రోజులు రెస్త్ తీసుకుంటానని విక్రమ్ కోరాడు. అదే సమయంలో శంకర్ కూడా సెకండాఫ్ లో తన వాయిస్ లో కూడా పూర్తి మార్పు ఉండేలా చూసుకోవాలని సూచించాడు. ఎందుకంటే విక్రమ్ ఇందులో రెండు డిఫరెంట్ పాత్రలను పోషించాడు.

ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి పిసి శ్రీ రామ్ సినిమాటోగ్రాఫర్. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version