గతంలో నందమూరి బాలకృష్ణ – మణిశర్మ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ లు మనకు అందించారు. ‘నరసింహనాయుడు’, ‘సమరసింహా రెడ్డి’ మరియు ‘లక్ష్మి నరసింహా’ సినిమాలు వీరి కలయికలో వచ్చిన ఆణిముత్యాలు
మణిశర్మ అందించే బాణీలకు, బాలయ్య బాబు మాస్ ఇమేజ్ కు జోడి సరిగ్గా సరిపోతుందని ప్రేక్షకుల నమ్మకం. అందుకే కాస్త విరామం తరువాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు
కొత్త దర్శకుడు సత్యదేవ్ తీయనున్న ఈ సినిమా మే 9న ప్రారంభంకానుంది. మరి మణిశర్మ
ఆ పాత కాంబినేషన్ ను రిపీట్ చేయనున్నాడా అన్నది త్వరలోనే తెలుస్తుంది. అభిమానులకు మాత్రం ఈ ఆడియో ఎదురుచుపులకు కారణం అవ్వనుంది