
జీవా రాబోతున్న తమిళ చిత్రం “యాన్” కోసం ఎట్టకేలకు కథానాయిక దొరికింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ మధ్యనే కాజల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది అని పుకార్లు వచ్చాయి. కాని రవి కే చంద్రన్ తులసి ని కథానాయికగా ఎంచుకొని అందరిని ఆశ్చర్యంలోకి నెట్టారు. నటి రాధా రెండవ కూతురయిన తులసి మణిరత్నం “కడల్” చిత్రంతో తెరకు పరిచయం అవుతున్న విషయం విదితమే. తులసి పద్నాలుగేళ్ళ అమ్మాయి ఆమె తన నటనతో మణిరత్నంని ఆకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని గతంలో “రంగం ” చిత్రం నిర్మిచిన ఆర్ ఎస్ ఇన్ఫోటైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇదిలా ఉండగా మణిరత్నం “కడలి” చిత్రం చాల భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు చిత్రం అద్భుతంగా వచ్చినట్టు సమాచారం.