కడల్ చిత్రీకరణ కోసం అండమాన్ వెళ్ళిన మణిరత్నం

కడల్ చిత్రీకరణ కోసం అండమాన్ వెళ్ళిన మణిరత్నం

Published on Jul 6, 2012 12:27 AM IST


మణిరత్నం చిత్రం అంటే భారతదేశంలో అద్భుతమయిన ప్రదేశాలలో చిత్రీకరణకు ప్రసిద్ది. ఆయన “రావణ్” చిత్రం కోసం అడవుల్లో చిత్రీకరించారు. ఆయన రాబోతున్న చిత్రం “కడల్” చిత్రీకరణ కోసం చిత్రం బృందంతో కలిసి అండమాన్ & నికోబార్ దీవులకి వెళ్లారు. ఈ చిత్రం అక్కడ ప్రత్యేకమయిన ప్రదేశాలలో రెండు వారాల పాటు ఒక పాట మరియు కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు.గౌతం మరియు తులసి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మి మంచు ,అరవింద్ స్వామి మరియు అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు రాజీవ్ మీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం జాలర్ల నేపధ్యంలో జరిగే ప్రేమకథగా ఉండబోతుంది.

తాజా వార్తలు