మణిరత్నం “కడలి” విడుదల తేదీ ఖరారు

మణిరత్నం “కడలి” విడుదల తేదీ ఖరారు

Published on Dec 25, 2012 12:23 AM IST

kadali
మణిరత్నం రాబోతున్న చిత్రం “కడలి” విడుదల తేదీ ఖరారయ్యింది. గౌతం కార్తీక్ మరియు తులసి నాయర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 1న ప్రేక్షకుల ముందుకి రానుంది.అరవింద్ స్వామి,లక్ష్మి మంచు మరియు అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్ర తమిళ వెర్షన్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళ నాడు బ్యాక్ డ్రాప్ లో మణిరత్నం దాదాపుగా పదేళ్ళ తరువాత చిత్రాన్ని చేస్తున్నారు. జాలర్ల పల్లెలో చిగురించే ప్రేమకథగా ఈ చిత్రం ఉండబోతుంది. అనుకోకుండా శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన జాలర్ల పరిస్థితిని కూడా మణిరత్నం ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు