త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న మణిరత్నం “కడల్”

త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న మణిరత్నం “కడల్”

Published on Feb 4, 2012 5:48 PM IST


మణిరత్నం రాబోతున్న చిత్రానికి అధికారికంగా “కడల్(సముద్రం)” అనే పేరుని ఖరారు చేశారు. గతం లో ఈ చిత్రానికి “పూక్కాడై” అనే పేరుని పరిశీలించారు. ప్రముఖ కథానాయకుడు కార్తిక్ తనయుడు గౌతం మరియు సమంత లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర కథా నేఫధ్యం జాలరి గ్రామం లో జరిగే కథగా ఉండబోతుంది. ఫిబ్రవరి ౧౧ తరువాత ఈ చిత్ర బృందం తో సమంత కలుస్తుంది. అర్జున్,లక్ష్మి మంచు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం అరవింద్ స్వామి కూడా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తుండగా రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు