కన్నప్ప ట్రైలర్ : భక్తితో పరమేశ్వరుడికి పట్టం.. సాలిడ్ కంటెంట్‌తో వస్తున్న మంచు హీరో!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో హీరో మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ కూడా ఒకటి. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ఈ మూవీపై అంచనాలను పెంచాయి. ఇక ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా కట్ చేశారు మేకర్స్. దేవుడిని నమ్మని తిన్నడు ఆ పరమశివుడి పరమభక్తుడిగా ఎలా మారాడు అనేది మనకు ‘కన్నప్ప’ మూవీలో అత్యద్భుతంగా చూపెట్టబోతున్నట్లు ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది. హై స్టాండర్డ్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయంగా ఈ ట్రైలర్ కట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా ప్రతి ఒక్కరు తమ పాత్రలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయనున్నారు. ఇందులో డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

రొటీన్ భక్తి చిత్రంగా కాకుండా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా మేకర్స్ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అటు మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సినిమాతో మంచు విష్ణు ప్రస్తుత జనరేషన్ ఆడియన్స్‌కు మరోసారి భక్తి చిత్రాల ప్రాధాన్యత తెలపనున్నాడు.

ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version