శ్రీమతి సేవలో సీనియర్ హీరో

శ్రీమతి సేవలో సీనియర్ హీరో

Published on Mar 23, 2020 8:03 PM IST

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన భార్య నిర్మలా దేవికి పరిచర్యలు చేస్తూ కనిపించారు. సోఫాలో నిద్రిస్తున్న నిర్మలా దేవి కి తన దగ్గరున్న రుమాలుతో విసురుతూ భార్య పైన ప్రేమను, స్త్రీ గొప్పతనాన్ని చాటి చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా అందరూ ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ఈ వీడియోలో భార్యకు సేవలు చేస్తూ కనిపించారు.

ఇక ఈ వీడియోని మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కాగా మోహన్ బాబు ప్రస్తుతం ఓ బై లింగ్వల్ మూవీలో నటిస్తున్నారు. సూర్య హీరోగా సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమాలో ఆయన ఓ కీలక రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/B-CahRSpEyu/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు