పాండవులు పాండవులు తుమ్మెదతో ఆశ్చర్యపరచనున్న మంచు మనోజ్

పాండవులు పాండవులు తుమ్మెదతో ఆశ్చర్యపరచనున్న మంచు మనోజ్

Published on Nov 19, 2013 1:35 AM IST

manoj-manchu

రిస్కీ స్తంట్లను మనకు అందించడమే కాక తన ఫైట్ లను తానే కంపోజ్ చేసుకునే నటుడు మంచు మనోజ్. ఈ యేడు తను నటించిన ‘పోటుగాడు’ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటిస్తున్నాడు

సమాచారం ప్రకారం ఈ సినిమాలో మనోజ్ మూడు పాత్రలలో కనిపించనున్నాడు. అందులో ఒకటి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఈ పాత్రను మనోజ్ యే ట్విటర్ లో బయటపెట్టాడు. మిగిలినవి ప్రస్తుతానికి గప్ చుప్ గా వుంచారు. ఏమైనా ఇందులో తన నటన అందరికీ నచ్చుతుందని తెలిపాడు

శ్రీవాస్ దర్శకుడు. మోహన్ బాబు, మంచు విష్ణు, రవీనా టాండన్, హన్సిక, ప్రణీత, వరుణ్ సందేశ్ మరియు తనీష్ ప్రాధాన పాత్రధారులు. విష్ణు మరియు మనోజ్ నిర్మాతలు

తాజా వార్తలు