నెక్స్ట్ ‘డేవిడ్ రెడ్డి’ గా మంచు హీరో!

నెక్స్ట్ ‘డేవిడ్ రెడ్డి’ గా మంచు హీరో!

Published on Aug 6, 2025 10:50 AM IST

మంచు వారి కుటుంబం నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరోస్ ఇద్దరి నుంచి ఈ ఏడాది భైరవం, కన్నప్ప చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇక మంచు విష్ణు కన్నప్ప తర్వాత తదుపరి సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ మంచు మనోజ్ నుంచి మాత్రం సాలిడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ అయ్యింది. ఒక భారీ పీరియాడిక్ డ్రామా తన నుంచి “డేవిడ్ రెడ్డి” గా అనౌన్స్ చేయడం జరిగింది.

తన 21 ఏళ్ల సినీ కెరీర్లో తన 21వ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని మనోజ్ చెబుతున్నాడు. దర్శకుడు హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బ్రిటీష్ కాలం నాటి నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నారు. 1897 నుంచి 1922 కాలంలో కథగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి మంచు మనోజ్ నుంచి ఈ బిగ్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వెల్వెట్ సోల్, టూర్ రాడిక్స్ సంస్థలు నిర్మాణం వహిస్తుండగా ఇతర వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి.

తాజా వార్తలు