గతనెలలో స్వర్గస్థులైన అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా ‘మనం’. ఈ యేడాదిలోనే ఎదురుచూస్తున్న చిత్రంగా ఈ మూడు తరాల మల్టీ స్టారర్ నిలిచింది. విక్రమ్ కుమార్ దర్శకుడు. శ్రియ, సమంత హీరోయిన్స్. ఈ సినిమా మార్చ్ 31న మనముందుకు రావడానికి ముస్తాబవుతుంది
నాగేశ్వరరావుగారి మరణం తరువాత మొదటిసారిగా మాట్లాడినా నాగార్జున తన తండ్రి అంతే తనకు ఎంత ఇష్టమో, నాగేశ్వరరావుగారికి ఈ రంగంఅంటే ఎంత ఇష్టమో తెలిపారు. “మనం” షూటింగ్ పీరియడ్ లో వుండగా ఆయనకు క్యాన్సర్ అని తెలిపారని, చాలా వరకూ దాంతో పోరాడినట్లు, చివరికి తనపాత్రకు డబ్బింగ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ తోనో చెప్పవలసివస్తుందేమో అని పరికరాలన్నీ తెప్పించుకుని ఇంట్లోనే స్వయంగా చెప్పిన విషయాలను నెమరువేసుకున్నారు
ఒక్క పాట మినహా ఏ.ఎన్ఆర్ షూటింగ్, డబ్బింగ్ లను ముగించుకున్నారు.”నాకు తండ్రి కంటే ఎక్కువైన ఆయనకు మనం సరైన రీతిలో సత్కారం అందిస్తుందని” తెలిపారు