అక్కినేని ఫ్యామిలీ ‘మనం’ రిలీజ్ డేట్

Manam
అక్కినేని ఫ్యామిలీ సినీ ప్రస్థానానికి మూల పురుషుడైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి చేసిన సినిమా ‘మనం’. ఈ సినిమాకి సంబందించిన ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. మాకు అందిన తాజాగా సమాచారం ప్రకారం ‘మనం’ సినిమాని మే 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఒక్క పాత మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ఆ బాలన్స్ ఉన్న ఒక్క పాటని ఏప్రిల్ 12 నుండి హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఆడియోని ఏప్రిల్ చివర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ డైరెక్టర్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్ష వర్ధన్ డైలాగ్స్ రాస్తున్నాడు.

Exit mobile version