జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘మనం’.. నాగ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘మనం’.. నాగ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

Published on Aug 3, 2025 7:00 AM IST

అక్కినేని ఫ్యామిలీకి లైఫ్‌టైమ్ మెమరీ చిత్రంగా ‘మనం’ ఎలాంటి క్రేజ్ దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేయగా లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు తో పాటు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య లీడ్ రోల్స్‌లో.. అఖిల్ అక్కినేని కేమియోలో నటించిన ఈ సినిమా అక్కినేని అభిమానులకు స్పెషల్ మెమరీగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా ఎన్నిసార్లు వచ్చినా చూడటానికి అక్కినేని అభిమానులు ఆసక్తిని చూపుతారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. జపాన్‌లో నాగార్జున క్రేజ్ మామూలుగా ఉండదు. అక్కడ ఆయన్ను అభిమానంతో నాగ్ సామా అని పిలుస్తారు. ఇక ఇప్పుడు ఆయన ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాను అక్కడ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీమియర్స్‌కు నాగ్ కూడా జపాన్ వెళ్తారనే టాక్ వినిపిస్తోంది.

మరి జపాన్‌లో మనం చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు