వినడానికి షాకింగ్ గా వున్నా నాగేశ్వర రావు, నాగార్జున, నాగ చైతన్య ల మల్టీ స్టారర్ మనం సినిమా త్రుట్టిలో పైరసీ బారి నుండి తప్పించుకుంది. కొంతమంది ఆకతాయులు ఈ సినిమా పాటలను యుట్యూబ్ లో పెట్టడానికి ప్రయత్నించగా నిర్మాతలు వారిని పట్టుకుని కేస్ ఫైల్ చేసారు
“కొంతమంది ఈ సినిమా పాటలను యు ట్యూబ్ లో పెట్టాలని ప్రయత్నించారు. మేము కంప్లైంట్ ఫైల్ చేశాము. ఇద్దరినీ అరెస్ట్ చేసారు. సినిమాకు ఎటువంటి నష్టం లేదు” అని దర్శకుడు విక్రమ్ కుమార్ తెలిపాడు. ముందుగా సినిమా మొత్తం ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైందని పుకార్లు వచ్చినా నిర్మాతలు వాటిని కొట్టిపడేశారు. గత ఏడాది పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలానే విడుదలకు ముందు పైరసీ బారిన పడి అందరికి షాక్ ఇచ్చింది
స్వర్గస్థులు ఏ.ఎన్.ఆర్ కి మనం చివరి సినిమా. ఈ చిత్రంలో సమంత, శ్రియ నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. ఈ సినిమా మార్చ్ 31న మనముందుకురానుంది