మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఒకటి ఉంది. అదే డైరెక్టర్ శంకర్ తో చిరంజీవి మూవీ. భారీ చిత్రాల దర్శకుడిగా పేరున్న శంకర్ చిరంజీవితో మూవీ చేయాలని, చాలా కాలంగా అనుకుంటున్నారు. ఐతే ఆ కాంబినేషన్ ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఐతే శంకర్ మొదటి చిత్రం జెంటిల్ మెన్ హిందీ రీమేక్ లో చిరంజీవి నటించారు. అల్లు అరవింద్ నిర్మాతగా 1993లో వచ్చిన ఆ మూవీకి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు.
ఐతే ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు బడా నిర్మాతలు వీరితో మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నారట. ఓ భారీ పాన్ ఇండియా మూవీ వీరి కాంబినేషన్ లో తెరకెక్కించాలని వారు భావిస్తున్నారని సమాచారం.దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య మూవీలో నటిస్తున్నారు.