సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. ఈ నెలతో టాకీ పార్ట్ మొత్తం పుర్తికానుంది. రెండు పాటలు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లను డిసెంబర్ మొదట్లో షూట్ చేయనున్నారు
ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2014 జనవరి 1న భారీ రీతిలో విడుదలకానుంది. సుకుమార్ దర్శకుడు. దేవి సంగీత దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్ గా ఆరంగ్రేటం చేయనుంది
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ ను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.