‘అఖండ 2’ లో ఫుల్ మాస్ సాంగ్.. థమన్ క్రేజీ నెంబర్

Akhanda2
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “అఖండ 2” కోసం అందరికీ తెలిసిందే. ఈసారి తాండవం ఆడించే విధంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని బోయపాటి ఎక్కడా తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా సంగీత దర్శకుడు థమన్ కూడా మాంచి బాణీలు అందిస్తున్నాడు.

ఇలా ఓ ఫుల్ మాస్ సాంగ్ షూట్ లో మేకర్స్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ సాంగ్ షూట్ లో ఉన్నట్టుగా మేము ఇది వరకే సమాచారం ఇచ్చాము. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సాంగ్ ని మంచి గ్రాండ్ నెంబర్ గా మొత్తం 600 మంది డాన్సర్ లతో ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సాంగ్ ని భాను మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్యకి పలు క్రేజీ డాన్స్ నంబర్స్ అందించిన థమన్ ఈసారి ఎలాంటి బీట్స్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version