కంప్లీట్ డిఫరెంట్ గా ఉండనున్న మహేష్.!

కంప్లీట్ డిఫరెంట్ గా ఉండనున్న మహేష్.!

Published on Oct 6, 2020 3:09 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ముందు మూడు భారీ హిట్లు మహేష్ నమోదు చేసుకోవడంతో ఈ చిత్రంపై తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో ఉన్న ఎన్నో విశేషాలలో అతి కీలకమైనది మహేష్ లుక్ అని చెప్పాలి.

ఇటీవలే ఒక యాడ్ షూట్ కోసం మహేష్ ప్రిపేర్ అయిన లుక్ ఒక్కసారిగా స్టన్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది ఇప్పటికీ అవుతుంది. అయితే ఇక మహేష్ ఇదే లుక్ లో “సర్కారు వారి పాట” లో కూడా ఉంటే బాగుణ్ణు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రానికి మాత్రం మహేష్ మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది అని తెలుస్తుంది.

బహుశా రెండు వేరియేషన్స్ లో మహేష్ ఈ చిత్రంలో కనిపించే అవకాశం ఉంది. జస్ట్ ప్రీ లుక్ పోస్టర్ తోనే మహేష్ మాస్ లుక్ కన్ఫర్మ్ అని అర్ధం అయ్యిపోయింది. కాస్త రఫ్ అండ్ రగ్గుడ్ గానే మహేష్ ఈ చిత్రంలో ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రం షూట్ వచ్చే నవంబర్ నుంచి యూ ఎస్ షూట్ తో మొదలయ్యి దాదాపు 45 శాతం షూట్ ను కంప్లీట్ ను చెయ్యనున్నారు.

తాజా వార్తలు