బ్యూటీషియన్ గా మారిన స్టార్ కిడ్..!

బ్యూటీషియన్ గా మారిన స్టార్ కిడ్..!

Published on May 23, 2020 8:30 PM IST

స్టార్ కిడ్ సితార కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె తండ్రి మహేష్ తో చేసే అల్లరి, డాన్స్ అండ్ సింగింగ్ వీడియోలు సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఏడేళ్ల ప్రాయంలో ఉన్న ఈ చిచ్చర పిడుగు అప్పుడే ఓ యూట్యూబ్ ఛానల్ అందుపుతుండగా, లక్షకు మించిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో సితార క్యూట్ వీడియోస్ వాళ్ళ అమ్మ నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా సితారకు సంబంధించి మరో క్యూట్ వీడియో ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సితార నమ్రతకు మానిక్యూర్ చేస్తుండగా తీసిన ఆ వీడియో ఆహ్లాదకరంగా ఉంది. సింగింగ్, డాన్సింగ్ టాలెంట్ తో పాటు బ్యూటీషియన్ స్కిల్స్ కూడా సీతారలో ఉన్నాయని అర్థం అయ్యింది. ఇక మహేష్ ఫ్యాన్సీ మరో ప్రక్క ఆయన నూతన మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. దాదాపు దర్శకుడు పరుశురాం తో మహేష్ మూవీ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

https://www.instagram.com/p/CAg-g7hDrlb/?igshid=q88hndyoltr5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు