అఖిల్ కోసం రియల్ లైఫ్ పాత్రలో నాగ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం..?

అఖిల్ కోసం రియల్ లైఫ్ పాత్రలో నాగ్.. అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం..?

Published on Jun 17, 2025 11:22 PM IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లేటెస్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి ‘లెనిన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసిన మేకర్స్, ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అఖిల్ మాస్ లుక్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అక్కినేని నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో నాగ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ పాత్రను దర్శకుడు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని.. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. నిజ జీవితంలో తండ్రీకొడుకులు అయిన నాగ్, అఖిల్.. ఇప్పుడు సినిమాలో కూడా తండ్రీకొడుకులుగా నటిస్తారనే వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాను విలేజ్ యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు