‘కూలీ’లో నాగ్ రోల్ ఇదే.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం!

‘కూలీ’లో నాగ్ రోల్ ఇదే.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఖాయం!

Published on Jun 17, 2025 10:00 PM IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి రజనీ తన సత్తా చాటడం ఖాయం. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో తన పాత్ర ఏమిటనే విషయాన్ని నాగ్ తాజాగా రివీల్ చేశారు. ‘కుబేర’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన నాగ్, కూలీ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు లోకేశ్ ఈ సినిమా కథను తనకు చెప్పేముందు, ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తారా అని తనని అడిగాడని.. అయితే, కథ విన్న కొద్ది నిమిషాలకే తాను ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నాగ్ తెలిపారు.

ఈ సినిమాలో నాగ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు