మొన్నటి వరకు మహేష్ ఫ్యాన్స్ ని బాగా బాధించిన విషయం పాన్ ఇండియా మూవీ. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్ కలిగిన మహేష్ పాన్ ఇండియా ప్రకటించకపోవడం, ఎప్పుడు టాలీవుడ్ కి సరిపోయే కథలు ఎంచుకోవడం వారిని అసహనానికి గురిచేసింది. కొడితే కుంభస్థలాని కొట్టాలన్న తీరుగా మహేష్ ఏకంగా రాజమౌళి తో పాన్ ఇండియా ప్రకటించారు. తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని స్వయంగా కన్ఫర్మ్ చేశారు.
ఐతే ఇప్పుడు మహేష్ పోటీ ఆసక్తికరంగా మార్చాడు. మహేష్ రాజమౌళి మూవీతో పాన్ ఇండియా రేసులోకి వచ్చాడు. దీనితో బాలీవుడ్ లో జెండా పాతే ఆ టాలీవుడ్ హీరో ఎవరవుతారనే ఆసక్తి కలుగుతుంది. బన్నీ పుష్ప మూవీతో, పవన్ కళ్యాణ్… క్రిష్ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఎన్టీఆర్, చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో వచ్చే ఏడాది బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ బాలీవుడ్ లో తమ సత్తా ఏమిటో నిరూపించుకోకున్నారు. మరి ప్రభాస్ తరువాత బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టే ఆ స్టార్ ఎవరో చూడాలి. ఐతే మిగతా హీరోల ఫలితం వచ్చే ఏడాది రానుంది. మహేష్ మాత్రం 2022లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.