ఏప్రిల్ నుండి మహేష్ – సుకుమార్ సినిమా షూటింగ్


సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం ఏప్రిల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉండటం, సుకుమార్ చిత్రానికి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉండటంతో ఏప్రిల్లో షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారు. గతంలో మహేష్ బాబుతో ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గాను హీరొయిన్ ఎవరన్నది ఇంకా ధ్రువీకరించలేదు. త్వరలో ఎవరన్నది ప్రకటించే అవకాశం ఉంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version