మహేష్ మూవీ టీమ్ సంబరాలు మళ్ళీ మొదలయ్యాయి

మహేష్ మూవీ టీమ్ సంబరాలు మళ్ళీ మొదలయ్యాయి

Published on Mar 1, 2020 3:00 AM IST

ఈ ఏడాది సంక్రాంతి చిత్రాలు విడుదలకు ముందు విడుదల తరువాత పెద్ద చర్చను రేపాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు భారీ విజయం సాధించడంతో వివిధ ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. దాదాపు సినిమా విడుదలైన నెల రోజుల వరకు వారి సందడి కొనసాగింది. కొంచెం హడావుడి ముగిసింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ సందడి మొదలుపెట్టారు. దానికి కారణం సరిలేరు నీకెవ్వరు 50 రోజులు పూర్తి చేసుకుంది.

ఈ రోజుల్లో ఒక థియేటర్ లో 50రోజులు సినిమా ఆడడం అంటే విశేషమే. దీనితో చిత్ర యూనిట్ సినిమాలోని వీడియో సాంగ్స్ మరియు మేకింగ్ వీడియోస్ విడుదల చేస్తున్నారు. దీనితో మళ్ళీ సోషల్ మీడియాలో సరిలేరు నీకెవ్వరు సినిమా సందడి మొదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, విజయ శాంతి కీలక రోల్ చేశారు. దేవిశ్రీ ఈ సినిమాకు సంగీతం అందించారు.

తాజా వార్తలు