మహేష్ ఫేవరేట్ సాంగ్ కి స్టెప్స్ వేసిన సితార.

సూపర్ స్టార్ మహేష్ గారాల పట్టి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ అల్లరి పిల్ల ఎప్పుడూ సాంగ్స్ పాడుతూ, డాన్స్ లు చేస్తూ మహేష్ మరియు నమ్రతలకు ఆహ్లాదం పంచుతుంది. గతంలో మహేష్ సూపర్ హిట్ సాంగ్స్ కి సితార స్టెప్స్ వేసి అలరించారు. తాజాగా సితార ఓ ఇంగ్లీష్ సాంగ్ కి డాన్స్ వేసింది. ఆ డాన్స్ వీడియో మహేష్ తన అధికారక ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకోవడంతో పాటు, నా ఫేవరేట్ సాంగ్ అంటూ కామెంట్ పెట్టారు.

ఇక మహేష్ తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట దర్శకుడు పరుశురాం తో ప్రకటించారు.ఈ చిత్రం సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటరైన్మెంట్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version