మహేష్ కి 2020 శుభారంభాన్ని ఇచ్చింది. ఆయన సంక్రాంతి చిత్రం సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యింది. కాగా ఈచిత్రం విడుదలై దాదాపు మూడు నెలలు అవుతుంది, కానీ మహేష్ కొత్త చిత్రానికి సంబందించిన ప్రకటన చేయలేదు. ఐతే త్వరలోనే మహేష్ తన కొత్త చిత్రాన్ని గ్రాండ్ లాంచ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మహేష్ గీత గోవిందం దర్శకుడు పరుశురాం తో కమిట్ అయినట్టు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఆయనతో మే 31న ఈ చిత్ర ప్రకటన మరియు గ్రాండ్ లాంచ్ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం మే 31న మహేష్ తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగా మహేష్ తన కొత్త మూవీని ప్రారంభించవచ్చని తెలుస్తుంది. ఐతే కరోనా ఎఫెక్ట్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడితేనే ఇది జరుగుతుంది.