మహేష్ మరో కొత్త వ్యాపారం..?

మహేష్ మరో కొత్త వ్యాపారం..?

Published on Mar 9, 2020 2:21 PM IST

సూపర్ స్టార్ గా వరుస సక్సెస్ లు అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు హీరో మహేష్. ఈ సంక్రాంతికి ఆయన సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. మరోవైపు మహేష్ అనేక బిజినెస్ లను నిర్వహిస్తున్నాడు. మల్టిఫ్లెక్స్ బిసినెస్ లో ఎంటరైన మహేష్ తాను హీరోగా తెరకెక్కే సినిమాలలో నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నాడు.

అలాగే కొద్దినెలల క్రితం ది హంబుల్ కో పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ స్థాపించాడు. ఆన్లైన్ బిజినెస్ పోర్టల్ గా ఈ బ్రాండ్ మంచి ఆదరణ దక్కించుకుంటుంది. కాగా మహేష్ మరో కొత్త వ్యాపారం ప్రారభించనున్నాడట . ఆయన ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ స్థాపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మహేష్ అనేక జాతీయ మరియు అంతర్జాతీయ వ్యాపార ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు