తన సెన్సేషనల్ కాంబోపై హింటిచ్చిన మహేష్.!

తన సెన్సేషనల్ కాంబోపై హింటిచ్చిన మహేష్.!

Published on Oct 7, 2020 12:00 PM IST

మన టాలీవుడ్ లో కాస్త ప్రయోగాత్మక సినిమాలు కానీ అప్పటి వరకు ఉన్న ట్రెండ్ కు డిఫరెంట్ గా కొత్త సబ్జెక్టులతో వచ్చే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే అలాంటి ఎన్నో చిత్రాలను మహేష్ టాలీవుడ్ కు అందించారు. అయితే వాటిలో ఎన్ని సార్లు చూసినా సరే బోర్ కొట్టని సినిమాలను మాత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో తెరకెక్కించిన “అతడు” మరియు “ఖలేజా” లే అని చెప్పాలి.

వీటిలో ఒకటి అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదని తెలిసిందే. కానీ ఇప్పటికీ రెండు చిత్రాలు అంటే చాలా మందికి మోస్ట్ ఫేవరెట్. అయితే మహేష్ థ్ ఇలాంటి అద్భుతమైన చిత్రాలను ఇచ్చిన త్రివిక్రమ్ తో మరో సినిమా చెయ్యాలని మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

ఇపుడు ఇదిలా ఉండగా “ఖలేజా” చిత్రం విడుదలై నేటికి పదేళ్లు పూర్తి కావడంతో మహేష్ ఫ్యాన్స్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటుండడంతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ కూడా “ఖలేజా” షూట్ డేస్ ను గుర్తు చేసుకుంటూ అప్పటి మేకింగ్ వీడియోను పంచుకున్నారు. అలాగే దీనితో పాటు మరో అదిరిపోయే అప్డేట్ ను కూడా ఇచ్చారు. తమ కాంబోలో తొందరలోనే సినిమా ఉందని హింటిచ్చేసారు. దీనితో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో సూపర్ హ్యాపీ అయ్యారు.

తాజా వార్తలు