శుక్రవారం కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు

శుక్రవారం కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు

Published on Aug 6, 2013 3:50 AM IST

Mahesh
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆత్రంగా ఈ శుక్రవారం గురించి ఎదురుచూస్తున్నారు. ఆ రోజులో అంత ప్రత్యేకత ఏముంది అంటారా?? ఆగష్టు 9 మహేష్ జన్మదినం ఒక కారణం అయితే ఆ రోజే మహేష్ నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా కొత్త టీజర్/విజువల్స్ విడుదలకానున్నాయి

మొదటి టీజర్ లో డైలాగ్ కంటెంట్ లేదు కాబట్టి, కొన్ని/ఒక డైలాగ్ కలిగిన చిన్నటీజర్ ను ఆరోజు విడుదల చేస్తారని అనధికారికి వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పై దర్శకుడు సుకుమార్ చాలా నమ్మకంగా వున్నాడు

14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ‘1-నేనొక్కడినే’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు

తాజా వార్తలు