మహేష్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్..?

మహేష్ డైరెక్టర్ తో మెగా పవర్ స్టార్..?

Published on Sep 4, 2020 12:45 PM IST

సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో మైల్ స్టోన్ సినిమా అయినటువంటి తన 25 వ చిత్రం “మహర్షి” ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని మహేష్ కు 25వ చిత్రం ఎలా ఉండాలో అలాంటి ఫీస్ట్ ను ఇచ్చారు దర్శకుడు వంశీ పైడిపల్లి. మంచి ఎమోషన్స్ మరియు అద్భుతమైన సందేశంతో అలరించారు.

ఇక ఆ చిత్రం తర్వాత మహేష్ అనీల్ రావిపూడితో “సరిలేరు నీకెవ్వరు” అనే చిత్రంతో భారీ హిట్ ను సొంతం చేసుకున్నారు. అయితే నిజానికి ఈ చిత్రం అనంతరం మహేష్ మళ్ళీ వంశీ తో చెయ్యాల్సి ఉంది. కానీ పలు కారణాలు చేత ఆ ప్రాజెక్ట్ ఆగాల్సి వచ్చింది.

దీనితో ఇపుడు ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను మెప్పించే పనిలో పడ్డట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే చరణ్ కు చాలా మంది దర్శకులు లైన్స్ వినిపించగా కొంతమందికి ఒకే చెప్పినట్టు బజ్ వినిపించింది. అలా ఇపుడు వంశీ కూడా చరణ్ కు ఒక లైన్ వినిపించి మెప్పించినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు