సూపర్ స్టార్ మహేష్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా దూసుకు పోతున్నారు. కాగా మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, 21 ఏళ్ళు అవుతుంది. ఆయన మొదటి చిత్రం రాజకుమారుడు 1999 జులై 30న గ్రాండ్ గా విడుదలైంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మహేష్ ని లాంఛ్ చేశాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన రాజకుమారుడు సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటా హీరోయిన్ గా నటించగా, ప్రకాష్ రాజ్ కీలక రోల్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ క్యామియో రోల్ చేయడం విశేషం.
రాఘవేంద్ర రావు టేకింగ్ మరియు మణిశర్మ సాంగ్స్ ఈమూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు మొదటి సినిమాతోనే మహేష్ ప్రేక్షకులను ఫిదా చేశారు. రాజకుమారుడు సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. హీరోగా 21 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ ఇప్పటి వరకు 26 చిత్రాలు చేశాడు.