ఊటీలొ రెడీ అవుతున్న సూపర్ స్టార్ స్క్రిప్ట్

ఊటీలొ రెడీ అవుతున్న సూపర్ స్టార్ స్క్రిప్ట్

Published on Jun 17, 2013 8:42 AM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనున్న తదుపరి చిత్రం స్క్రిప్ట్ పనులు ఊటీలో జరుగుతున్నాయి. ‘ఆగడు’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నాని ఎంపిక చేసారు. ఈ చిత్ర టీం స్క్రిప్ట్ సూపర్బ్ గా రావాలని పని చేస్తున్నారు, అలాగే శ్రీను వైట్ల ఈ సినిమాలో కూడా కామెడీ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మహేష్ బాబు – శ్రీ వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ‘దూకుడు’ నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు