కళ్ళుచెదిరే ధరకు అమ్ముడుకానున్న నేనొక్కడినే శాటిలైట్ రైట్స్

కళ్ళుచెదిరే ధరకు అమ్ముడుకానున్న నేనొక్కడినే శాటిలైట్ రైట్స్

Published on Aug 15, 2013 4:02 AM IST

Nenokkadine-release-date
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎల్లప్పుడూ శాటిలైట్ రైట్స్ పరంగా మంచి ట్రాక్ రికార్డేవుంది. సినీరంగంలో వినిపిస్తున్న వార్తలు ప్రకారం తన తరువాత చిత్రం ”1- నేనొక్కడినే ” కి శాటిలైట్ రైట్స్ మరోసారి రికార్డు స్థాయిలో రేటు పలకనుంది. అనాధికార సమాచారం ప్రకారం జెమినీ టీవీ వారు సినీ నిర్మాతలతో చర్చలలో ఉన్నరనీ మరియు కళ్ళు తిరిగే ధర పలుకుతున్నారని తెలిసింది. నిర్మాత ద్వారా అధికారిక ప్రకటన వచ్చిన తరువాత సరైన ధరను మేము ప్రకటిస్తాము.

హీరోలకు వైవిధ్యమైన పాత్రను చిత్రీకరించగల సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. కృతి సనన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ఈ భారీ బడ్జెట్ థ్రిల్లర్ ను 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది.

స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది

తాజా వార్తలు