ఈ నెలాఖరు నుంచి మొదలు కానున్న మహేష్ ‘1’ డబ్బింగ్

ఈ నెలాఖరు నుంచి మొదలు కానున్న మహేష్ ‘1’ డబ్బింగ్

Published on Oct 9, 2013 3:30 PM IST

Nenokkadine

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఈ నెల 30 నుంచి మొదలు కానున్నాయి. మొదట్లో సినిమాలో నటించిన ప్రముఖ నటులు, చిన్న చిన్న పాత్రలు చేసే నటీనటులు డబ్బింగ్ చెప్పనున్నారు. ప్రస్తుతం థాయ్ ల్యాండ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ప్రొడక్షన్ టీం 2014 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. మహేష్ బాబు సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ఈ మూవీని హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబందించిన మరికొన్ని ప్రత్యేక వార్తలు త్వరలోనే మీకందిస్తాం.

తాజా వార్తలు