యమలీలకు మొదటి హీరో మహేష్ యే: ఆలీ

1_37_89_Ali-Stills-in-Aliba

ఆలి హీరోగా నటిస్తున్న ‘ఆలీబాబా ఒక్కడే దొంగ’ సినిమా అతనికి హీరోగా 50వ సినిమా. అంతేకాక తెలుగులో హీరోగా 20ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. దాదాపు 3దశాబ్దాలుగా 100కు పైగా సినిమాలలో నటించాడు

ఆలి హీరో గా నటించిన మొదటి సినిమా యమలీల 1994లో విడుదలైంది. ఈ చిత్రంపై ఆలి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిపాదు. . ఈ సినిమా దర్శకుడు ఎస్.వి కృష్ణా రెడ్డి ముందుగా ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో తెరకేక్కిద్దాం అనుకున్నాడట. దీనికి కృష్ణ గారికి యమస్పీడు అనే టైటిల్ తో కధ కూడా చెప్పాడట. కధ విన్న తరువాత కృష్ణగారు మహేష్ హీరోగా నటించాలంటే 3ఏళ్ళు ఆగమన్నారట. ఒకరోజు దర్శకుడు, అచ్చి రెడ్డి గారు కలిసి నన్ను అగ్రీమెంట్ పై సంతకం చెయ్యమన్నారు . తరువాత ఈ సినిమాలో నేనే హీరో అని చెప్పారు. అదే యమలీల అని తెలిపాడు

ఈ మధ్య టీ.వి షోలలో నటిస్తున్న ఆలి తన తదుపరి చిత్రం ఈ నెల 21న విడుదలకానుంది

Exit mobile version