
మరో ప్రోడక్ట్ కి అంబాసడర్ గా చెయ్యడానికి మహేష్ బాబు ఒప్పుకోనున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఐడియా,థమ్స్ అప్, మహీంద్రా, ప్రోవోగ్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జాయ్ అల్లుకాస్ వంటి వాటికి అంబాసడర్ గా ఉన్న మహేష్ బాబు తాజా సమాచారం ప్రకారం దక్షిణ భారత దేశంలో రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసడర్ గా చెయ్యనున్నారు. గతంలో షారుఖ్ ఖాన్,సైఫ్ అలీ ఖాన్,ధోని, హర్భజన్ సింగ్ ఈ ప్రాడక్ట్ కి అంబాసడర్ గా వ్యవహరించారు. త్వరలో మహేష్ బాబు మీద ఒక యాడ్ ని చిత్రీకరించనున్నారు ఇదిలా ఉండగా ప్రస్తుతం సూపర్ స్టార్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్ర చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉన్నారు. ఇది అయ్యాక అయన తిరిగి సుకుమార్ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” జనవరి 11న విడుదలకు సిద్దమవుతుంది.