బిజినెస్ మేన్ కోసం డబ్బింగ్ చెప్పనున్న మహేష్

బిజినెస్ మేన్ కోసం డబ్బింగ్ చెప్పనున్న మహేష్

Published on Dec 13, 2011 2:35 PM IST


ప్రిన్స్ మహేష్ బాబు ఈ నెల 16 నుండి ‘బిజినెస్ మేన్’ చిత్రం కోసం డబ్బింగ్ చెప్పనున్నారు. ఇతర నటీ నటులు మరియు డబ్బింగ్ పూర్తవగా ప్రస్తుతం షాయాజీ షిండే శబ్దాలయ స్టుడియోలో డబ్బింగ్ చెప్తున్నారు. మహేష్ బాబు 12వ తేదీ నుండి డబ్బింగ్ చెప్పాల్సి ఉండగా పలు కారణాల వాళ్ళ 16వ తేదీకి మార్చారు. శరవేగంగా పోస్ట్ ప్ర్దక్షన్ పనులు జరుపుకుంటున్న బిజినెస్ మేన్ జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకి సిద్ధమవుతుంది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేస్తానని చెప్పిన పూరి జగన్నాధ్ రికార్డు సమయంలో పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 22 న శిల్ప కళా వేదికలో జరగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు