సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘1-నేనొక్కడినే’ సినిమా జనవరిలో భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఈ సినిమా విజయంపై ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు ట్విట్టర్ లో కొన్ని ట్వీట్స్ వేసాడు. అలాగే మైలురాయి లాంటి సినిమాని అందించిన టీంకి థాంక్స్ చెప్పారు. ‘
మహేష్ బాబు ఈ సినిమాకి పనిచేసిన డైరెక్టర్ సుకుమార్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మరియు ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.
మహేష్ బాబు వేసిన ట్వీట్స్ మీ కోసం..
‘ఆడియో టీజర్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ థాంక్స్’.
‘ఈ సినిమా నా కెరీర్లో ఓ మెయిలు రాయిగా నిలిచిపోతుంది’.
‘ సినిమా ఇంత బాగా వచ్చేందుకు కారణమైన డైరెక్టర్ సుకుమార్ కి, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుకి, అలాగే 14 రీల్స్ కి సంబందించిన మొత్తం టీంకి థాంక్స్ చెప్పాలి’.
‘ఇప్పటి వరకూ దేవీశ్రీ ప్రసాద్ కెరీర్ లో వచ్చిన వాటిల్లో ఈ మూవీ ది బెస్ట్ అవుతుంది. దేవీ చాలా కష్టపడ్డాడు అది మీకు కనపడుతుంది. థాంక్యూ దేవీ’.
‘ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పనితనం గురించి మెచ్చుకోవాలి. ఆయన వర్క్ సింప్లీ సూపర్బ్’
‘చివరిగా డైరెక్టర్ సుకుమార్ గురించి,, సుకుమార్ టాలెంట్ ని ఎవరితోనూ పోల్చలేనిది. 1 సినిమాకి అతనిది ది బెస్ట్ వర్క్ అని చెప్పాలి. థాంక్యూ సార్’.
‘నా నిర్మాతలు, మెయిలు రాయిగా 1 సినిమా నిలిచి పోవాలని 14 రీల్స్ వారు అన్ని రకాలుగా ప్రయత్నించారు. వాళ్ళకి పెద్ద థాంక్స్’.