సమంత మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నిన్న వెంకటేష్ మరియు మహేష్ బాబు చిత్రీకరణలో పాల్గొన్నారు ఈ చిత్రంలో వీరు ఇద్దరు అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రంలో అంజలి వెంకటేష్ సరసన కనిపించబోతున్నారు. ఈ మల్టీ స్టారర్ చిత్రం మీద ఇప్పటికే జనం లో భారీ అంచనాలున్నాయి.