లవ్ ఫెయిల్యూర్ చిత్రాన్ని పొగిడిన మహేష్ బాబు


సిద్ధార్థ్ మరియు అమలా పాల్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు మెల్లిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం గురించి ఇటీవలే అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ అకౌంటులో ప్రశంసించాడు. ఇప్పుడు ఈ వరుసలో మరో హీరో చేరిపోయాడు. ప్రిన్స్ మహేష్ బాబు లవ్ ఫెయిల్యూర్ చిత్రం గురించి పొగుడుతూ ట్వీట్ చేసాడు. తను ఇటీవలే ఈ సినిమా చూసాను సిద్ధార్థ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులందరికీ విషెస్ తెలిపాడు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన సిద్ధార్థ్ తమ యూనిట్ సభ్యులకు విషెస్ చెప్పిన మహేష్ బాబుకి కృతజ్ఞతలు తెలిపాడు.

Exit mobile version