సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువగానే ఉండనున్నాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చేజింగ్ సీక్వెన్స్ లు ఎక్కువగానే ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని బైక్, కార్ చేజ్ సీక్వెన్స్ లు తీసిన తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు ప్రస్తుతం కొన్ని బోట్ చేజింగ్ సీక్వెన్స్ లు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చేజింగ్ సన్నివేషాల షూటింగ్ క్రబి బీచ్ రిసార్ట్ ఏరియాలో జరుగుతోంది.
కృతి సనన్ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం కానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు సరికొత్త లుక్ మరియు స్టైలిష్ అవతారంలో కనిపించనున్నాడు.