టాలీవుడ్ సూపర్ స్టార్ రెండు రోజుల క్రితం బుజ్జి పాపకి తండ్రయ్యారని మేము ఐడి వరకే తెలిపాము. తాజా సమాచారం ప్రకారం ఈ పాపకి ఒక అందమైన పేరును ఖరారు చేశారు. ఈ విషయన్ని మహేష్ బాబు గారే స్వయంగా ప్రకటించారు. ” పాప పేరు ఘట్టమనేని సితార. పాపకి మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదం కావాలి అని” మహేష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. హైదరాబాద్లోని స్వప్న నర్శింగ్ హొమ్ లో నమ్రత శుక్రవారం ఈ పాపకి జన్మనిచ్చింది.