సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రానున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ రోజు నుండి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ బాబు స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ఈ సినిమా ద్వారా మోడల్ కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాని సమ్మర్ చివరికల్లా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.