మహేష్ బాబు చుట్టమైన కృష్ణ మాధవ్ హృదయం ఎక్కడున్నది అనే రొమాంటిక్ ఎంటెర్టైనర్ ద్వారా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకు వి ఆనంద్ దర్శకుడు. సంస్కృతి, అనూష హీరోయిన్స్. పవన్ మరియు సంజయ్ నిర్మాతలు
ఈ సినిమా గురించి కృష్ణ మాధవ్ మాట్లాడుతూ “జీవితంలో ప్రతీదానికి అయోమయంలో పడిపోయే ఆర్కిటెక్ట్ పాత్రలో కనిపించనున్నాను. ఒకరితో ప్రేమలో పది, మరో అమ్మాయిని చూశాక ఎవరిని చేస్కోవలో తెలియని స్థితిలో పడిపోయే స్టోరీని ఆనంద్ అందంగా తీర్చిదిద్దాడని” తెలిపాడు. మాధవ్ ఈ సినిమాకు ముందు అమెరికాలో నటనను అభ్యసించాడు. అంతేకాక ముందుగా ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. “సినిమాలో లోటుపాట్లు తెలియాలంటే అన్నీ క్రాఫ్ట్ లపైనా అవగాహన వుండాలన్నది” ఆయన నమ్మకమట
అంతేకాక మహేష్ బాబు చాలా మంచి నటుడని, పాత్రలోకి తేలికగా దూరిపోగలడని ఆయనే నాకు స్పూర్తి అని తెలిపాడు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ఈ నెల 15న మనముందుకు రానుంది