సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్

సుకుమార్ టీంతో కలిసి గోవాలో చిందేయనున్న మహేష్

Published on Oct 14, 2012 9:51 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కొత్త షెడ్యూల్ గోవాలో జరగనుందని ఇది వరకే తెలియజేశాం. ఈ షెడ్యూల్ ఈ రోజు నుంచి గోవాలో ప్రారంభం కానుంది. ఈ రోజు నుంచి జరిగే చిత్రీకరణలో మహేష్ బాబుతో పాటు తెలుగు తెరకు పరిచయం కానున్న కృతి సనన్ కూడా కలిసి నటించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై అనిల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్లో ఇప్పటి వరకూ చేయని సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రాన్ని 2013 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు