సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి మహేష్ బాబు ఎక్కువగా కష్ట పడుతున్నాడని సమాచారం. ఈ సినిమా యూనిట్ 40 రోజుల మారథాన్ షెడ్యూల్ ని ఫాస్ట్ గా అనుకున్న సమయనికి ముగించారు. ఈ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో దాదాపు ప్రతిరోజు ఈ సినిమా యూనిట్ అందరు లేట్ నైట్ లు చేశారని తెలిసింది. ఇక్కడ షూటింగ్ ముగిసిన తరువాత ఈ సినిమా యూనిట్ మరికొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి లండన్ కు వెళ్ళే అవకాశం ఉంది.
మహేష్ బాబు ‘1’ సినిమా షూటింగ్ చాలా వేగంగా నిర్వహిస్తున్న సమయంలో షూటింగ్ జరిగే ప్రదేశానికి చాలా మంది అభిమానులు రావడంతో ఈ సినిమా బృందానికి ఆశ్చర్యంకలిగించింది. ఈ సంవత్సరం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘1’. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సూపర్ సినిమా తరువాత మహేష్ బాబు నటిస్తున్నసినిమా ఇది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా14రీల్స్ బ్యానర్ పై గోపిచంద్, రామ్ ఆచంట, అనిల్ సుంకరలు నిర్మిస్తున్నారు.