మహేష్ తో నటించాలని వుందన్న కంగనా

మహేష్ తో నటించాలని వుందన్న కంగనా

Published on Mar 8, 2014 6:18 PM IST

mahesh-babu-kangana-ranaut
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రస్తుతం ‘క్వీన్’ సినిమా విజయపు ఆనందంలో వుంది. ఆమె నటించిన పాత్ర విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కంగనా తెలుగు సినిమా రంగంలో ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’ సరసన నటించిన విషయం తెలిసినదే.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మీరు తెలుగు సినిమాలలో ఎందుకు నటించట్లేదు అని ప్రశ్నించగా ఆమె “నేను తెలుగు సినిమా అంటూ చేస్తే అది మహేష్ బాబు సరసన అవకాశం వచ్చినప్పుడే. ఆటను చాలా పెద్ద స్టార్ మరియు అందగాడు” అని చెప్పింది.

నిజానికి మహేష్ సరసన నటించాలి అన్న బాలీవుడ్ నటి కంగనా మాత్రమే కాదు. కరీనా కపూర్, సోనాక్షి సిన్హా వంటి తారల కోరిక కూడా ఇదే.

తాజా వార్తలు