రాజమౌళి కోసం మహేష్ తొలిసారి అలా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ చిత్రంగా జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమాలో మహేష్ తన కెరీర్‌లో తొలిసారి ఓ అరుదైన ఫీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో హీరోలు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంటారు. అయితే, ఈ ట్రీట్ ఇచ్చేందుకు చాలా మంది డైరెక్టర్లు మహేష్‌ను గతంలో ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, మహేష్ ఎవరికీ ఈ రకమైన ఫీట్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.

ఇక తాజాగా రాజమౌళి సినిమాలో మహేష్ తొలిసారి షర్ట్ లేకుండా ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగినట్లు చిత్ర వర్గాల టాక్. మొత్తానికి ఎవరికీ సాధ్యం కాని పనిని రాజమౌళి చేయించడం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మహేష్ చొక్కా లేకుండా ఎలా ఉన్నాడనేది చూడాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version