మళ్ళీ బ్యాంకాక్ కి చేరిన మహేష్ బాబు

మళ్ళీ బ్యాంకాక్ కి చేరిన మహేష్ బాబు

Published on Oct 4, 2013 4:50 PM IST

mahesh-Nenokkadine
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘1-నేనొక్కడినే’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్ ల్యాండ్ లో జరుగుతోంది. కర్బి బీచ్ రిసార్ట్ ఏరియాలో కీలకమైన కొన్ని చేజింగ్ సీక్వెన్స్ లను షూట్ చేసిన తర్వాత ఈ చిత్ర టీం బ్యాంకాక్ చేరుకుంది. ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుగుతోంది, అక్కడే మరి కొద్ది రోజులు షూటింగ్ జరగనుంది.

సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘1-నేనొక్కడినే’ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ వారు ఈ సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమా ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయం కానుంది. ‘1-నేనొక్కడినే’ మూవీ 2014 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు