సూపర్ స్టార్ మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 46.77 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులు మాకు జనవరి 11నే సంక్రాంతిని మాకు ఇచ్చారు. నేను, దిల్‌రాజుగారు, అనిల్ సుంకర కలిసి షేర్స్ మాట్లాడుకుంటూ మిరాకిల్స్ ఫీలయ్యాం. నిజంగా మైండ్ బ్లాక్ అయింది.
రిలీజ్ రోజు సినిమాను నా పిల్లలతో చూస్తాను. అది నాకు సెంటిమెంట్. నేను నిన్న పిల్లలతో సినిమా చూసి విజయశాంతిగారిని ఈవెనింగ్ కలిశాను. ఆ కేరక్టర్‌ను ఆవిడ తప్ప, ఇంకెవరూ చేయలేరు. ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. ఈ ప్రాజెక్టులో ఆవిడ పనిచేసినందుకు ఆనందంగా ఉంది. దూకుడు తర్వాత నేను చేసిన సినిమాలన్నీ గొప్ప సినిమాలు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. ఇలా! వాటికి ఎక్కడో స్క్రిప్ట్ కి సరెండర్ అయిపోవాలి. అనిల్ గారు నాకు కథ చెప్పినప్పుడు నేను ఎగ్జయిట్‌మెంట్ ఫీలయ్యాను. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు చెప్పిన తీరు కొత్తగా అనిపించింది. ఆ ఫుల్ క్రెడిట్ అనిల్ రావిపూడికి ఇస్తున్నాను.